బ్యాంకు అధికారులపై హరీశ్ రావు వివాదస్పద వ్యాఖ్యలు..!

-

బ్యాంకు అధికారులపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. గత పదేళ్లలో ఎప్పుడూ రైతులకు ఇలాంటి పరిస్థితి లేదని రైతులే చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో సాగునీరు లేదు.. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. సాగు నీరు లేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పంటలు ఎండిపోతుంటే రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు. రాష్ట్రమంతటా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రికి ఈ విషయం పట్టడం లేదని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై తప్ప రైతుల గురించి సీఎంకు ఆలోచన లేదని ఫైర్ అయ్యారు. రైతు కష్టాల్లో ఉంటే బ్యాంకుల వాళ్లు అప్పుల గురించి నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. అప్పులు కట్టాలని బ్యాంకుల వాళ్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. బకాయిలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. బ్యాంకు అధికారులు రజాకార్లను తలపించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీపైనే మొదటి సంతకం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. వంద రోజులైనా రేవంత్ రెడ్డి రుణమాఫీపై నిర్ణయం తీసుకోలేదన్నారు. రైతులకు ఇచ్చిన నాలుగు హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version