రంజాన్ స్పెషల్: చక్కెర వ్యాధిగ్రస్తులు ఉపవాసం ఉండాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

-

రంజాన్ నెలని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. నెలంతా ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు. సూర్యుడి వచ్చినప్పటి నుండి వెళ్ళిపోయేదాకా ఏమీ తినకుండా కనీసం నీళ్ళు తాగకుండా ఉండడమనేది చిన్న విషయం కాదు. అదీ ఎండాకాలంలో. ఐతే ఈ టైమ్ లో డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. డయాబెటిస్ ఉండి ఉపవాసం ఉండాలనుకున్నవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య, రక్తంలో చక్కెర నిల్వలు పెరగడం, లేదా తగ్గడం, ఇంకా నిర్జలీకరణం.

డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండాలనుకుంటే ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్సులిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ దాన్ని ఒకట్లో మూడు వంతులు తగ్గించాలి. రెండు డోసుల ఇన్సులిన్ కంటే ఎక్కువ తీసుకునేవారు ఉపవాసానికి దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ డయాబెటిస్ ఉండి కూడా ఉపవాసం ఉంటే కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉపవాసం మానేయాలి.

చెమట ఎక్కువగా వచ్చినపుడు, రక్తంలో చక్కెర నిల్వలు 70 mg/dl కంటే తక్కువకి వెళ్ళినపుడు ఉపవాసం మానేయాలి. పండగ నెల కాబట్టి స్వీట్లు తెలియకుండానే తినేయడం జరుగుతుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా పండగ నెలలో గానీ, పండగ పూట గానీ స్వీట్లు తక్కువ తినాలి. గర్భవతులు, చిన్నపిల్లలు, పెద్ద వయసులో ఉన్న పేషెంట్లు, రక్తపీడనం ఎక్కువగా ఉన్న వారు ఉపవాసానికి దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఎండాకాలం కాబట్టి, పండగ నెలలో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version