ఆధార్ సేవ‌ల‌కోసం హెల్ప్‌లైన్ నంబ‌ర్‌.. ఒక్క ఫోన్ కాల్‌తో సేవ‌లు..

-

క‌రోనా నేప‌థ్యంలో యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్ర‌జ‌ల‌కు అనేక సౌకర్యాల‌ను ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. దీంతో ఆధార్ సెంట‌ర్‌కు వెళ్ల‌కుండానే ప‌లు సేవ‌ల‌ను పొందే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌక‌ర్యం అందించ‌డం కోసం యూఐడీఏఐ తాజాగా ఓ హెల్ప్ లైన నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేయ‌డం ద్వారా పౌరులు ఆధార్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

ప్ర‌జ‌లు 1947 అనే హెల్ప్‌లైన్ నంబ‌ర్‌కు త‌మ సెల్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయ‌వ‌చ్చు. దీంతో ద‌గ్గ‌ర్లోని ఆధార్ సెంట‌ర్ వివ‌రాలు సుల‌భంగా తెలుస్తాయి. ఈ మేర‌కు యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఆధార్ సెంట‌ర్ వివ‌రాలు తెలియ‌క కొంద‌రు ఆందోళ‌న‌కు లోన‌వుతుంటారు. ఆధార్ సేవ‌ల‌ను ఎక్క‌డ పొందాలో కూడా కొంద‌రికి తెలియ‌దు. అలాంటి వారు ఈ నంబ‌ర్‌కు కాల్ చేయ‌డం ద్వారా త‌మ‌కు స‌మీపంలో ఉండే ఆధార్ సెంట‌ర్ వివ‌రాల‌ను సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

కాగా ప్ర‌స్తుతం యూఐడీఏఐ ఆన్‌లైన్‌లోనూ ఆధార్ సెంట‌ర్ వివ‌రాల‌ను తెలుసుకునే వెసులుబాటు క‌ల్పిస్తోంది. దానికి అద‌నంగా ఈ హెల్ప్‌లైన్ నంబ‌ర్ ప‌నిచేస్తుంది. ప్ర‌జ‌లు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా ఆధార్ పేరు, చిరునామా మార్పు వంటి వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. అయితే మొబైల్ నంబ‌ర్ మార్చాల‌న్నా, బ‌యో మెట్రిక్ వంటి ఇత‌ర వివ‌రాల‌ను అప్‌డేట్ చేయాలంటే ఆధార్ సెంట‌ర్‌కు క‌చ్చితంగా వెళ్లాలి. ఈ క్ర‌మంలో త‌మ‌కు స‌మీపంలో ఉండే ఆధార్ సెంట‌ర్‌ల వివ‌రాల‌ను పైన తెలిపిన నంబ‌ర్‌కు కాల్ చేయ‌డం ద్వారా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version