శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.7వేలే.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

-

శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎం02 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇది వ‌ర‌కే గెలాక్సీ ఎం2ఎస్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ ఫోన్‌ను కూడా అదే సిరీస్‌లో లాంచ్ చేశారు. గెలాక్సీ ఎం02 స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను అమ‌ర్చారు. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అమ‌ర్చారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం2 ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10
* డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

శాంసంగ్ గెలాక్సీ ఎం2 స్మార్ట్ ఫోన్ రెడ్‌, గ్రే, బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.6,999 ఉండ‌గా, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ కూడా వినియోగదారుల‌కు ల‌భిస్తోంది. అయితే బేస్ మోడ‌ల్‌ను లాంచింగ్ కింద రూ.6,799 ధ‌రకే అందివ్వ‌నున్నారు. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తారు. ఫిబ్రవ‌రి 9వ తేదీ నుంచి వినియోగ‌దారుల‌కు ఈ ఫోన్ ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version