మధ్యప్రదేశ్ లో ఓ వింత చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రత్లామ్ జిల్లాకు చెందిన షాహీన్ అనే మహిళ సోమవారం వింత శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. మొండెంపై రెండు తలలు పక్కపక్కన ఉండగా… అందులో నుంచి మూడో చేయి ఉంది. జరాలోని నీమ్ చౌక్ కు చెందిన షాహీన్ బీ పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేశారు. రెండు తలలతో శిశువు ప్రసవించడంతో వైద్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రస్తుతం శిశువును మెరుగైన వైద్యం కోసం ఇండోల్ లోని మహారాజా యశ్వంత్ రావు ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు.