ఒకప్పుడు స్మార్ట్ ఫోన్.. అంటే.. బాగా ఖరీదు ఉండేది. కానీ ఇప్పుడు మన బడ్టెట్ లోనే బోలెడన్నీ ఫోన్లు వస్తున్నాయి. వాటిలో ఫీచర్స్ కూడా చాలా ఉంటున్నాయి. మన దగ్గర 6వేలు ఉన్నా.. ఫోన్ తీసేయొచ్చు.. అలా ఉంది ఇప్పుడు మార్కెట్. సాధారణంగా.. ఇంట్లో ఉండే అమ్మకు, అమ్మమ్మకు ఇలాంటి వారికి.. ఫోన్ కొనాలననప్పుడు వారికి పెద్దగా బడ్జెట్ లో తీసుకోరు. స్మార్ ఫోన్ అయి ఉండాలి, వీడియో కాల్స్ మాట్లాడేదానికి వీలుగా ఉండాలి, స్టోరేజ్ ఎక్కువగా అవసరం లేదు, మనలా సెల్ఫీలు కూడా వాళ్లు ఎక్కువ తీసుకోరు. మరి అలా ఇంట్లో వాళ్లకు ఏదైనా ఫోన్ తీసుకోవాలి అన్నప్పుడు నోకియా సీ01 ప్లస్ ఫోన్ మంచి ఎంపికే.
Nokia C01 plus హైలెట్స్ :
ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 6,799గా ఉండగా, 2 జీబీ + 16 జీబీ రూ. 6.299గా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5.45 ఇంచెస్ హెచ్‌డీ+డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యునిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ (Unisoc SC9863a) ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నల్ స్టోరేజ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 3000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు. వీటితో పాటు 4జీ ఎల్‌టీఈ, వైఫై,3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
ఇక కెమెరా సంగతి చూస్తే.. ఇందులో 5 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఉంటుంది. రెండు కెమెరాలకు ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్ ఉండడం ప్రత్యేకత.
తక్కువ ధరలో ఫోన్ కొనాలనుకునే వారు ఓసారి ఈ ఫోన్ పై లుక్కేయండి. ఇది మిమ్మల్ని ఆకర్షించవచ్చేమో కదా..!