ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ డేట్‌పై వస్తున్న వార్తలకు నిర్మాత ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ ఏడాది అయినా వస్తుందా? రాదా? అన్న డైలమాకు తెరదించుతూ.. దసరా సందర్భంగా అక్టోబర్ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ను రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి ఈ డేట్ వైపే మొగ్గుచూడానికి కారణం ఆసక్తి రేపుతుంది.
ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ చేయడానికి రాజమౌళి ముందు రెండే ఆప్షన్స్ వున్నాయి. ఒకటి దసరా.. లేదంటే… 2022 సంక్రాంతి. మూడేళ్ల నుంచి ఊరిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ను ఇంకో ఏడాది వాయిదా వేస్తే.. ఆడియన్స్‌లో సినిమాపై ఇంట్రస్ట్ తగ్గిపోతుంది. సమ్మర్‌కే రిలీజ్ చేద్దామనుకున్నా.. చాలా సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. సమ్మర్ డేట్ ఫిక్స్ చేసుకుని.. విజువల్ ఎఫెక్ట్ష్ పూర్తికాక మరోసారి వాయిదా వేయాల్సి వస్తుందన్న భయంతో… సేఫ్ సైడ్‌గా దసరాను ఎంచుకున్నాడు జక్కన్న.
ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ విడుదల తేదీకి కూడా చిన్న మెలిక వుంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌దేవగణ్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. అక్టోబర్ 13తో అజయ్‌కు అజయే పోటీగా మారాడు.
ఆర్‌ఆర్‌ఆర్ కొత్త రిలీజ్ డేట్‌తో అజయ్‌దేవగణ్‌కు అజయే పోటీగా మారాడు. ఆర్‌ఆర్‌ఆర్ వచ్చిన రెండు రోజులకే.. అజయ్ నటించిన మరో మూవీ ‘మైదాన్’ అక్టోబర్ 15న రిలీజ్ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌ది అతిథి పాత్రే అయినా… బాలీవుడ్ మార్కెట్ కోసం… అజయ్‌ను తీసుకున్నాడు రాజమౌళి. ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా మైదాన్‌లో అజయ్ కోచ్‌గా నటిస్తున్నాడు. మైదాన్ కూడా భారీ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. మైదాన్ రిలీజ్ ప్రభావం ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్స్‌పై పడనుంది.
బాహుబలి2 హిందీలో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. హ్యూజ్ ఓపెనింగ్స్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ బాలీవుడ్‌ను నమ్ముకుంది. రెండు రోజులకే మైదాన్ వస్తే.. హిందీలో ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్స్‌కు గండిపడుతుంది. ఇవన్నీ చూసుకోకుండానే.. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడా? ఇంట్రనల్‌గా తెలుసుకున్న జక్కన్న మైదాన్ అక్టోబర్ 15న వచ్చే అవకాశం లేదు కాబట్టే.. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీ రివీల్ చేసి వుంటాడు.
రిలీజ్ డేట్ ప్రకటించే సందర్భంలో.. రామ్‌చరణ్ గుర్రం స్వారీ చేస్తూ.. ఎన్టీఆర్ బుల్లెట్ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అక్టోబరు 13న నీరు-నిప్పు కలిసి వస్తున్నాయి. ఆ శక్తిని ముందెప్పుడూ చూసి వుంటరంటూ.. ట్వీట్ చేసింది ఆర్‌ఆర్‌ఆర్ టీం.