ఢిల్లీ తరహా అల్లర్లకు హైదరాబాద్ లో ప్లాన్…!

-

దేశ రాజధాని ఢిల్లీ లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిరసనలు కాస్తా అల్లర్లు గా మారి హింసకు కూడా దారి తీసాయి. దీనితో భారీ ఆస్తి నష్టం తో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పుడు ఇలాంటివే హైదరాబాద్ లో కూడా ప్లాన్ చేసారట. ఒక ప్రార్ధనా కేంద్రం వద్ద దీన్ని ప్లాన్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఓ బస్సుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేసారని తెలుస్తుంది.

పోలీసుల అప్రమత్తతతో వారి కుట్ర భగ్నం చేసారు. హైదరాబాద్‌లోని రియాసత్‌ నగర్‌కు చెందిన హర్షద్‌, బాబానగర్‌కు చెందిన అబ్దుల్‌ వసీ బాల్య స్నేహితులు. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల వీడియోలను వీరు నిశితంగా చూసి అదే విధంగా ఇక్కడ కూడా ప్లాన్ చేసారట. మాదన్నపేట్‌ ప్రాంతంలో ఇటీవల ఓ వర్గానికి చెందిన ప్రార్థన కేంద్రం వద్ద విధ్వంసకర చర్యలకు కూడా కొందరు దిగారు.

కంచన్‌బాగ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సుకు నిప్పు అంటించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో… సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా దాడులకు పాల్పడింది ఆ ఇద్దరు అని గుర్తించారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసారు పోలీసులు. మాదన్నపేట్‌, కంచన్‌బాగ్‌ ఘటనలతో పాటు చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏటీఎంను కూడా ధ్వంసం చేసారని ఒప్పుకున్నారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అనే దాని మీద విచారణ ముమ్మరం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version