భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సెంచరీల మెషిన్ గా పేరు తెచ్చుకున్న భారత ఆటగాడు కోహ్లీ, సెంచరీ చేయక చాలా రోజులు అవుతుందని, దానికి కారణం కెప్టెన్సీ బాధ్యతలే అని అంటున్నారు. ఈ మేరకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. భారత మాజీ ఆటగాడు కపిల్ దేవ్ స్పందిస్తూ ఇలా అన్నారు. కోహ్లీ ఆటతీరును ప్రశ్నిస్తున్న వారందరూ సెంచరీలు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు. అలా చేయకపోవడానికి కారణం కెప్టెన్సీ వల్లే అంటున్నారు.
నిజానికి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కోహ్లీ, 65టెస్టు మ్యాచుల్లో 20సెంచరీలతో 17అర్థ సెంచరీలు నమోదు చేసాడు. అదే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో కెప్టెన్ గా చేసిన కోహ్లీ 95మ్యాచుల్లో 21సెంచరీలు, 27అర్థ సెంచరీలతో 5500పరుగులకి పైగా స్కోరు చేసాడు. ఈ లెక్కన కెప్టెన్సీ వల్ల ఫామ్ కోల్పోవడం అనేది కారణం కాదు. ఏ ఆటగాడికైనా ఒకానొక సమయం గడ్డుకాలంగా నడుస్తుంది. ప్రస్తుతం కోహ్లీకి అలాంటి టైమే అనుకోవచ్చు. కోహ్లీ మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వస్తే సెంచరీ కాదు ట్రిపుల్ సెంచరీలు చేస్తాడు అని వ్యాఖ్యానించారు.