ఆ స్టార్ హీరో వల్లే మనీషా కొయిరాలా ఇండస్ట్రీకి దూరమైందా..?

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్ , సౌత్ అని తేడా లేకుండా స్టార్ హీరోలు, అద్భుతమైన డైరెక్టర్ లతో సినిమాలు చేసింది. దక్షిణాదిలో తన కెరియర్ ముగిసిపోవడం గురించి తాజాగా ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. స్వతహాగా నేపాలి అయిన ఈమె నాగార్జున క్రిమినల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సౌత్లో పలు సినిమాలలో కనిపించిన ఈమె బాబా , బొంబాయి, ఒకే ఒక్కడు సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది.

ఇక బాబా సినిమా తర్వాత పూర్తిగా సౌత్ ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు ఆ విషయం గురించి చెబుతూ అప్పుడు ఏం జరిగింది.. అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది మనీషా కొయిరాలా. ఆమె మాట్లాడుతూ..” బాబా.. బహుశా నా చివరి భారీ తమిళ సినిమా.. ఆ రోజుల్లో చాలా ఘోరంగా ఫ్లాప్ అయింది.. ఇంకా చెప్పాలంటే పెద్ద డిజాస్టర్ మూవీ.. ఈ మూవీ పై రిలీజ్ కి ముందే చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఘోరంగా ఫెయిల్ అయ్యేసరికి సౌత్ లో నా కెరియర్ క్లోజ్ అయిపోయిందని అనుకున్నారు.. కరెక్ట్ గా అదే జరిగింది.

సౌత్ లో బాబా సినిమాలో నటించడానికి ముందు నా చేతిలో దక్షిణాది సినిమాలు ఎన్నో ఉన్నాయి.. కానీ బాబా మూవీ డిజాస్టర్ అయ్యేసరికి అవకాశాలు కూడా పోయాయి. దాంతో ఇక అవకాశాలు రాకుండా పోయాయి అందుకే నేను సౌత్ ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ చెప్పుకొచ్చింది మనీషా కొయిరాలా. ఒకరకంగా చెప్పాలంటే రజనీకాంత్ తో కలిసి బాబా సినిమాలో నటించడం వల్ల అవకాశాలు పోయాయని ఇండైరెక్టుగా చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version