పర్మిషన్ లేకుండా థియేటర్ కి వెళ్లలేదు : అల్లు అర్జున్

-

సంధ్య థియేటర్ వద్ద పుష్ప–2 ప్రీమియర్ షో కు తాను రోడ్డు షో చేయలేదని అల్లు అర్జున్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పర్మిషన్ లేకుండా థియేటర్ కి వెళ్లలేదు. అనుమతి తీసుకొనే థియేటర్ లోకి వెళ్లాను. నేను పర్మిషన్ లేకుండా వెళ్లా అనేది పచ్చి అబద్ధం.  దాదాపు 20 ఏళ్ల నుంచి నేను ఆ థియేటర్ లో సినిమా చూస్తున్నాను.  తన కోసం వేలాదిగా వచ్చి, గంటల తరబడి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానన్నారు. అనంతరం సినిమా చూస్తుండగా కాసేపటి వరకు ఏం జరిగిందో తనకు ఏ పోలీసులు చెప్పలేదన్నారు. తొక్కిసలాట, రేవతి మరణం గురించి తనకు మరుసటి రోజు తెలిసిందన్నారు. థియేటర్ లో ఉన్నప్పుడు తెలియదన్నారు. నా భార్య, పిల్లలు థియేటర్ లో వదిలి వెల్లినట్టు తెలిపారు అల్లు అర్జున్.

పర్మిషన్ లేకుంటే పోలీసులే నన్ను తిరిగి పంపిస్తారు.. కానీ నేను థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లే జనాన్ని క్లియర్ చేశారు. శ్రీ తేజ్ కోలుకుంటున్నారు అది గుడ్ న్యూస్ చెప్పాలి. ఇందులో ఎవ్వరి తప్పు లేదు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమన్నా అంటున్నానా..? నేను చాలా బాధ పడుతున్నాను. నేను ఎవ్వరినీ దూషించుకోదలచుకోలేదు. అంతా మంచి జరగాలనుకుంటున్నాను. సినిమాకు వచ్చే వారిని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను. 

Read more RELATED
Recommended to you

Exit mobile version