మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపు దశాబ్దకాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తనను తిట్టడానికేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలు బాధ్యత ఇచ్చినప్పుడు వారి గురించి ఆలోచించకుండా శ్వేతపత్రాల పేరుతో కాంగ్రెస్ 5 నెలలు సమయం వృథా చేసిందని ఆరోపించారు. ప్రజలను గాలికొదిలి, హామీలను పట్టించుకోకుండా ఊదరగొడుతున్న కాంగ్రెస్పై ప్రజలు విసుగెత్తిపోయారని తెలిపారు.
తన ఆనవాళ్లు లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కొందరు చెప్పారని అది సాధ్యమేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు నామరూపాలు లేకుండా పోయిందా? అని ప్రశ్నించారు. అదో వికృతమైన ఆలోచన అని దుయ్యబట్టారు. ఎవరికైనా టైమ్ వస్తుందన్నారు. ప్రజల ఆలోచన సరళిని మార్చినప్పుడు ఫలితం ఇలా ఉంటుందని తెలిపారు.