బిగ్‌బాస్ షో తో మంచి క్రియేట్ సంపాదించుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్న యాక్టర్ సోహైల్.. అయితే తాజాగా ఈ నటుడు తాను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించానని.. అలాగే సినిమాల పైన ఆసక్తితో ఇటు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు అలాగే ఒకానొక సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలతో సూసైడ్ చేసుకోవాలి అని కూడా అనుకున్నాను అంటూ తెలిపాడు..
బిగ్‌బాస్ షో తో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు యాక్టర్ సోహైల్.. ప్రస్తుతం నటుడుగా కూడా రాణిస్తున్నాడు అయితే ఈయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు.. “నేను 8వ తరగతి చదువుతున్నపుడు చిరంజీవి గారి ‘కొడితే కొట్టాలిరా..’ పాటకు డాన్స్ వేశా. అప్పుడు ఓ నేపాలీ అమ్మాయి వచ్చి మాట్లాడింది. తనని ఇష్టపడ్డా. నేను అన్ని ఎగ్జామ్స్ కాపీ కొట్టి పాస్ అయ్యా.. డెస్ర్ వెనకాల రాసుకుని.. పరీక్షలకు వెళ్లేవాడిని అలాగే అన్ని డిగ్రీ పరీక్షలు పాస్ అయిపోయా..అలాగే నేను చాలా సున్నితమనస్కుడిని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ఓపెన్ హర్ట్ సర్జరీ అయిన తర్వాత నన్ను ఉద్యోగం చేయమని ఇంట్లో వాళ్లు రోజూ అడుగుతుండే వాళ్లు. ఎప్పుడు సెటిల్ అవుతావు? అని అడిగే వాళ్లు. నాకేమో సినిమాలంటే ఇష్టం. అప్పటికీ రెండు సినిమాల్లో నటించా కానీ హీరోగా గుర్తింపు రాలేదు. ఇంట్లోనేమో ఉద్యోగమంటూ ఒత్తిడి.. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయి సూసైడ్ ఆలోచన వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరడానికి వెళ్లి కూడా నా గమ్యం ఇది కాదు అని వెనక్కి వచ్చేశాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. కానీ నేను ఇలా ఉండడానికి మా నాన్న ఎన్నో త్యాగాలు చేశారు… వాటన్నిటిని నేను ఎప్పటికీ మర్చిపోను ” అంటూ చెప్పకు వచ్చాడు..
అలాగే “చిన్నప్పుడు ఎక్కడ షూటింగ్ జరిగిన వెళ్లేవాడినని అయితే తాను మొదటిగా చూసిన హీరోయిన్ తమన్నా అంటూ చెప్పకు వచ్చాడు ఇంటర్ చదువుతున్న సమయంలోనే కొత్త బంగారులోకం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నా ఫోటోలు పంపించాను ఈ సినిమాలో నాకు సైడ్ క్యారెక్టర్ వచ్చింది.. అలా నా సినీ ప్రయాణం మొదలైంది. హీరోగా నా మొదటి సినిమా ‘మ్యూజిక్ మ్యాజిక్’ హిట్ అవ్వలేదు. ఆ సినిమాకు మా నాన్న.. వాళ్ల ఫ్రెండ్స్‌ను తీసుకొని వెళ్లారు. కానీ థియేటర్లో షో వెయ్యలేదు. చాలా బాధపడ్డా. తర్వాత సీరియల్స్‌లో కూడా నటించా. రియాలిటీ షో వల్ల పేరు వచ్చింది. తాజాగా లక్కీ లక్ష్మణ్ అనే సినిమాలో నటించా. అది త్వరలో విడుదలకానుంది… ” అంటూ చెప్పాడు ఈ నటుడు..