అమ్మాయిలకు మొఖం మొటిమలు చాలా కామన్‌గా ఉండే సమస్య.. వీటిని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. తినే ఆహారం వల్ల, కాలుష్యం వల్ల మొటిమలు వస్తాయి అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ మీరు పడుకునే పొజిషన్ వల్ల కూడా ముఖంపై మొటిమలు వస్తాయి తెలుసా..? ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజమే.. కంటికి నిద్ర ఎంత మంచిదో.. అది సరిగ్గా లేకుంటే..అంత చెడ్డది..మీరు పడుకునే పొజిషన్ కరెక్టుగా లేకపోతే మీకు చాలా సమస్యలు వస్తాయి.. ముఖంపై ముడతలు రావడానికి కూడా ఇది ఒక కారణం..! మరి పడుకునేప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దామా..!
మనం ఎలా అయితే ఉతికిన బట్టలు వేసుకుంటామో.. దిండు కవర్లు కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఎప్పటికప్పుడు పిల్లో కవర్స్ మారుస్తూ ఉండాలి. ఎందుకంటే వాటి మీద దుమ్ము, ధూళి మీకు అస్సలు కనిపించదు.. దిండు మీద ముఖం మీద పెట్టుకుని పడుకున్నపుడు అందులోని బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశిస్తుంది. ఇది మొటిమలను కలిగిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒకసారి అయినా మీ దిండు కవర్ మార్చుకోవాలి.
నైట్ పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయి మేకప్ తీయకుండానే అలానే పడుకుంటారు. కానీ అసలు అలా చేయొద్దు. మేకప్ వేసుకుని పడుకోవడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. మేకప్‌లోని అవశేషాలు రాత్రంతా రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల మొటిమలు వస్తాయి. అందుకే మీరు ఎంత అలసిపోయినా కూడా మేకప్‌ని తప్పనిసరిగా రిమూవ్ చేశాక పడుకోండి. పడుకునేప్పుడు ఫేస్ క్లీన్‌గా ఉంచుకోవాలి. ముఖంపై ఎలాంటి జిడ్డు, మేకప్ లాంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోని పడుకోవాలి.చాలా మందికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. దీని వల్ల కూడా మొటిమలు వస్తాయి. పొట్ట మీద పడుకోవడం వల్ల చర్మం నేరుగా దిండు కవర్ మీదే ఉంటుంది. దీని వల్ల చర్మం మీద అధిక ఒత్తిడి పడుతుంది. ఇంకా బోర్లా పడుకోవడం వల్ల ముఖంపై ముడతలు కూడా త్వరగా వస్తాయి.
హెయిర్ ఆయిల్స్ జుట్టుకి మంచిదే, కానీ అవి చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఆయిల్ స్కిన్ ఉన్నవారు తలకి నూనె పెట్టుకుని నిద్రపోకూడదు. ఎందుకంటే ఆయిల్ రాత్రంతా మొహానికి కారుతుంది. దీనివల్ల ముఖం అందం దెబ్బతింటుంది. పింపుల్స్ వస్తాయి.. చాలామంది తలకు ఆయిల్ ఉంటేనే జుట్టు బాగా పెరుగుతుంది అనుకుంటారు.. అలా ఏం కాదు.. ఆయిల్ అనేది జుట్టు పెరుగుదలలో ఏం అంత గొప్పపాత్ర వహించదు.. కేవలం ఆయిల్ పెట్టుకోని రెండు మూడు గంటలు ఉంచుకోని తలస్నానం చేస్తే చాలు. ఎప్పుడూ ఆయిల్ పెట్టుకోని ఉండాల్సిన అవసరం లేదు.మీరే గమనించండి.. ఆయిల్ పెట్టుకోని తలస్నానం చేసినప్పుడు షాంపూ ఎక్కువ పడుతుంది. అదే ఆయిల్ లేకుండా చేస్తే తక్కువ షాంపూ పడుతుంది. షాంపూ అంటే కెమికల్స్.. నిజానికి స్కల్ అనేది ఎంత క్లీన్‌గా ఉంటే జుట్టు అంత బాగుంటుంది. అలాగే ఫేస్ కూడా..
చర్మానికి సరైన క్లెన్సర్ ఉపయోగించాలి. చర్మంపై మురికి టవల్ లేదా వాష్ క్లాత్ ఉపయోగించడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. నిజానికి బాడీకి వాడే టవల్‌ను ఫేస్‌కు వాడకూడదు.. కానీ అందరూ ఒకటే వాడేస్తారు.. చర్మానికి ఎప్పుడూ క్లీన్‌గా ఉండే స్పెషల్ టవల్ మాత్రమేవాడాలి.అది కూడా మీరు మాత్రమే..ఇంట్లో అందరూ కలిపి ఒకటే అస్సలు వాడకూడదు.
ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు సమస్య ఉండదు. ఇక మీరు తినే ఆహారం, బయట ఎక్కువగా తిరిగినప్పుడు పడే దుమ్ము వల్ల ఎలాగూ మొటిమలు వస్తాయి.. వీలైనంత వరకూ ఆయిల్ ఫుడ్స్‌ను తగ్గించండి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తింటే ఫేస్ బాగుంటుంది.