సీఎం చంద్రబాబు వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఆయనే స్వయంగా ప్రజల ఇంటికి వెళ్లి వారిని అడిగి తెలుసుకుంటున్నారు.
తాజాగా చంద్రబాబు శనివారం ఉదయం ఓ ఫ్యామిలీ ఇంటికి వెళ్లారు. అక్కడ కుటుంబసభ్యులతో మాట్లాడుతూ..పెద్దయ్యాక ఏమవుతావమ్మా? అని ఓ చిన్నారిని అడిగారు. సీఎం అవుతాను అని బాలిక చెప్పడంతో.. ఆయన నవ్వుతూ.. నా కుర్చీకే ఎసరు పెట్టావా? అని అంటూ హాస్యాస్పదం పండించారు. బాలికను దగ్గరికి తీసుకుని నవ్వుతూ ముచ్చటించారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.