మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు

-

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పులిని అన్నావ్, తొడ కొట్టావ్…ఇప్పుడు ఎక్కడికి పోయావు? నేను ఎక్కడికీ పారిపోయే వాడిని కాదు అని చెప్పి ఎక్కడికి వెళ్లావు?

ఒకవేళ నువ్వు జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు. గతంలో అంటే సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఇప్పుడు ఎక్కడకు పోతావ్’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాగా, గతంలో వైసీపీ అధికారంలో ఉన్పప్పుడు చంద్రబాబు అండ్ ఫ్యామిలీ, ప్రస్తుతం కూటమి నేతలపై అనుచితవ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టించి మరీ జైలుకు పంపుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news