రైల్వే స్టేషన్లో నేమ్ బోర్డ్స్ ఎందుకు పసుపు రంగులో ఉంటాయో తెలుసా??

-

ప్రతి ఒక్కరికి రైలు ప్రయాణం గురించి తెలిసి ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రైల్వే స్టేషన్లలో నేమ్ బోర్డులు ఎందుకు పసుపు రంగులో ఉన్నాయి అని. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ పసుపు రంగు వేయడం వల్ల ఉపయోగం ఏమిటి? ఆ రంగు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. మరి ఏంటి ఆ ఉపయోగాలు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మనం సైన్స్ పాఠాల్లో VIBGYOR గురించి చదివే ఉంటాము. ఇందులో ఎరుపు రంగుకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దూరంగా ఉన్న ఎరుపు రంగు వస్తువులను తొందరగా గుర్తించగలం. అందుకే ఎరుపు రంగును ప్రమాద హెచ్చరికలు గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తారు.

ఎరుపు రంగుతో పోలిస్తే, పసుపు రంగు తరంగ దైర్ఘ్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా పసుపు రంగు కాంతి ఆకర్షణ గుణం ఉంటుంది. అందుకోసమే రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డు మీద పేర్లు రాసి ఉంటాయి. ఇది కాంతివంతంగా కనిపించడం వల్ల రైలు ఏ స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తుందో లోకో ఫైలెట్ చాలా సులభంగా గుర్తించగలరు.

మీరు గమనించవలసిన మరొక విషయమేమిటంటే పసుపు రంగు బోర్డుల మీద నల్లటి రంగుతో మాత్రమే పేరు రాసి ఉంటారు. అలా రాయడానికి కూడా ఒక కారణం ఉంది వేరే రంగుతో పేర్లు రాయడం వల్ల కాంతి పడినప్పుడు రిఫ్లెక్షన్ అవ్వదు. కానీ అలా రిఫ్లెక్ట్ అయ్యే గుణం ఒక నలుపు రంగు మాత్రమే ఉన్నది. అందువల్ల రైల్వే స్టేషన్లలో పసుపు బోర్డుపై నల్లటి అక్షరాలతో రాసి ఉంటారు. ఇక్కడే కాకుండా స్కూల్, కాలేజీ బస్సులకు కూడా పసుపు కలర్ ని వాడుతూ ఉంటారు దానికి కారణం అందరి దృష్టిని ఆకర్షించడం దీని వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version