మనిషి కన్నా.. చీమ మిన్నా.. ఎందుకో తెలుసా?

-

అవునండి మీరు చదివింది ముమ్మాటికి నిజమే. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ లు వాడడం, భౌతిక దూరం పాటించడం వంటివి అలవాటు చేసుకున్నాం. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే చీమలు కూడా ఇలాంటి జాగ్రత్తలు ఎప్పటి నుండో పాటిస్తున్నాయి. మరి అలాంటప్పుడు మనుషుల కన్నా చీమలు మిన్నా అనడంలో తప్పులేదు కదా! మరి చీమలు పాటించే ఆ జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం..

సాధారణంగా చీమలు నాలుగు రకాలు ఉంటాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, కాపలా చీమలు, సైనిక చీమలు. ఇందులో శ్రామిక చీమలు లేదా కూలి చీమలు బయటకు వెళ్లి ఆహారాన్ని సేకరించి తీసుకు వస్తూ ఉంటాయి. అవి ఆహారాన్ని తీసుకొని వెలుపలకు వచ్చేటప్పుడు సైనిక చీమలు వీటిపై ఫార్మిక్ ఆమ్లంని స్ప్రే చేస్తాయి అంటే శానిటేషన్ చేస్తాయి.

చీమలు మనుషుల్లా సానుభూతి చూపవు తమ సమూహంలో ఏ చీమకైనా అనారోగ్యం చేస్తే. మిగతా చీమలు వాటిని దూరంగా పెడతాయి ఇలా చేయడం ద్వారా వ్యాధి ప్రబలకుండా మిగతా చీమలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ చీమలను చంపేస్తాయి అని స్ట్రోయ్ మెట్ తన పరిశోధనలో పేర్కొన్నారు. Covid ను ఎదుర్కోవాలంటే చీమల నుంచి మనం కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె తన పరిశోధనలో పేర్కొన్నారు.

సాధారణంగా చీమల ప్రయాణించేటప్పుడు మనం గమనించే ఉంటాము. అవి ఒకదాని వెనుక ఒకటి వెళ్తూ ఉంటాయి భౌతిక దూరం అనే ప్రక్రియ చీమలకు నిత్య కృత్యాలట. అంటే అవి అంటు వ్యాధులు ప్రబలకుండా నిత్యం ఈ దూరాన్ని పాటిస్తాయి. అలాగే బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు ఒకదానిపై ఒకటి రసాయన చర్యలు ఉంటాయని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరి ఇప్పుడైనా ఒప్పుకుంటారు కదా మనుషులకన్నా చీమలు ఎంతో మిన్న అని.

Read more RELATED
Recommended to you

Exit mobile version