షాకింగ్‌.. పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధర ఎక్కువ ఉంది.. ఎందుకు..?

-

కరోనా మహమ్మారి కారణంగా ఓ వైపు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇక ఢిల్లీలోనైతే డీజిల్‌ ధర పెట్రోల్‌ ధరను మించిపోయింది. దీంతో అందరూ షాక్‌ తింటున్నారు. సాధారణంగా అనేక నగరాల్లో రెండు ఇంధన ధరలకు కనీసం రూ.3.50 నుంచి రూ.9.50 వరకు వ్యత్యాసం ఉంది. పెట్రోల్‌ కన్నా డీజిల్‌ ధరే తక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీలో సీన్‌ రివర్స్‌ అయింది. అయితే ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు.

ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను 27 నుంచి 30 శాతానికి పెంచగా, డీజిల్‌పై వ్యాట్‌ను 16.75 నుంచి 30 శాతానికి మే 5వ తేదీన పెంచింది. దీంతో అక్కడి ధరల్లో అలాంటి షాకింగ్‌ వ్యత్యాసం వచ్చిందని తెలిపారు. ఇక ఢిల్లీలో ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.88 ఉంది. పెట్రోల్‌ ధర ఇందుకు 48 పైసలు తక్కువగా ఉంది.

అయితే సాధారణంగా ఒకప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు రూ.18 నుంచి రూ.20 మేర భారీ వ్యత్యాసం ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా డీజిల్‌ ధర ఇంచు మించుగా పెట్రోల్‌ ధరకు సమానంగా ఉంటూ వస్తోంది. ఇక ఇప్పుడు ఢిల్లీలో డీజిల్‌ ధర పెట్రోల్‌ ధరను దాటేసి అందరికీ షాకిచ్చింది. మరి ముందు ముందు ధరలు ఎలా పెరుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version