చనిపోయిన 55 మంది చైనా జవాన్ల జాబితా.. నిజమెంత..?

-

గాల్వన్‌ లోయలో ఇటీవలే భారత్‌, చైనా జవాన్లు పరస్పరం దాడి చేసుకోగా.. ఆ దాడిలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు మృతి చెందారు. అయితే చైనా మాత్రం తమ జవాన్లు ఎంత మంది చనిపోయింది ఇప్పటి వరకు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆ దాడిలో 40 మంది వరకు చనిపోయి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ దాడిలో మొత్తం 55 మంది చైనా సైనికులు చనిపోయారని, వారి లిస్ట్‌ ఇదే.. అంటూ ఓ జాబితా సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఇంతకీ అసలు ఇందులో నిజం ఉందా..? అంటే..

భారత్‌తో గాల్వన్‌ లోయలో జరిగిన దాడిలో చనిపోయిన 55 మంది చైనా సైనికుల జాబితా ఇదే.. అంటూ ప్రచారంలో ఉన్న ఆ లిస్ట్‌ నకిలీదని తేలింది. వారు చైనా సైనికులే.. కానీ వారు ప్రస్తుతం దాడిలో చనిపోయిన వారు కాదు. గతంలో కొరియాతో జరిగిన యుద్ధంలో చనిపోయిన చైనా జవాన్ల లిస్టు అది. ఆ జాబితా వికీపీడియాలో ఉంది. దాన్ని కాపీ చేసి ప్రస్తుత దాడికి లింక్‌ చేసి ఆ జాబితాను ప్రచారం చేస్తున్నారు. కనుక ఆ జాబితా ఫేక్‌ అని తేలింది.

సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలలో చాలా వరకు ఫేక్‌ వార్తలే ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ. కనుక ఎవరూ తమకు వచ్చే వార్తలను నమ్మకూడదు. అవి నిజమా, కాదా అని నిర్దారణ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version