రైల్ నిలయం వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తా.. ఫుల్‌గా ట్రాఫిక్ జామ్

-

సికింద్రాబాద్ సమీపంలోని రైల్ నిలయం మార్గమధ్యలో లోడుతో వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌లోని డీజిల్ అంతా నెల పాలయ్యింది.వందల లీటర్ల డీజిల్ అంతా నెలపాలవ్వడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇంధనం మీద నుంచి వెళితే ఏదైనా ప్రమాదం జరగొచ్చని జంకుతున్నారు.

స్పీడ్‌గా వాహనాలు సైతం జారిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగి నిప్పురవ్వలు వస్తే మొత్తం ఫైర్ అయ్యే చాన్స్ లేకపోలేదు. వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది సికింద్రాబాద్ -మెట్టుగూడ మార్గంలో ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. కొందరినీ దారి మళ్లింపు చేస్తుండగా.. లారీ బోల్తా పడిన చోట బ్యారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆమార్గంలో ఫుల్‌గా ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్రైవర్ పొరపాటు వల్లే వాహనం బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news