Rowdy Boys Teaser: “రౌడీ బాయ్స్‌”గా వ‌స్తున్న‌ దిల్‌రాజు ఫ్యామిలీ హీరో

-

Rowdy Boys Teaser: ఫిలీమ్ ఇండస్ట్రీలో వార‌సుల ఎంట్రీ కొత్తేమికాదు. ఎక్కువగా హీరోలు, నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ల వారసులు సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంటారు. తాజాగా టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒక‌రు దిల్‌ రాజు. ఆయ‌న సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి చాలా రోజులు అవుతుంది. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మించి బడా నిర్మాత‌గా ఎదిగాడు. ఆయ‌న త‌న కుటుంబం నుంచి కూడా ఓ హీరో ఉండాల‌నుకున్నాడో .. ఏమో ఆయ‌న‌ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి హీరోగా చేస్తున్నాడు.

దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూవీ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ బాయ్స్‌’ అనే చిత్రంలో హీరోగా న‌టించనున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం వహిస్తుండడం విశేషం.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను వివి వినాయ‌క్ విడుద‌ల చేయ‌గా, మోష‌న్ పోస్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. టీజర్‌ను గమనిస్తే సినిమా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సోర్టీగా క‌నిపిస్తున్న‌ది. ఓ అమ్మాయి కోసం రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ అనే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దిల్‌ రాజు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వస్తున్న తొలి హీరో ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version