ఐటీ దాడులపై దిల్‌ రాజు క్లారిటీ…. 20 లక్షలు దొరికాయంటూ !

-

ఐటీ దాడులపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. నాలుగురోజులుగా ఐటీదాడులు మా నివాసాల్లోనూ .. ఆఫీస్ లోనూ జరిగాయన్నారు. అయితే… కొన్ని ఛానెల్స్ ,సోషల్ మీడియాలో మా వద్ద డబ్బు డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారని ఆగ్రహించారు. కానీ 20 లక్షల లోపు మాత్రమే ఉన్నాయని దిల్‌ రాజు పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదన్నారు.

dil

24 క్రాఫ్ట్స్ లో లావాదేవిల డిటైల్స్ తీసుకున్నారని… పైనల్ గా నావద్ద డాక్యమెంట్స్ చెక్ చేశారన్నారు. డిపార్ట్మెంట్ వారు ఆశ్చర్య పోయారు.. అంతా క్లీన్ గా ఉందన్నారన్నారు. మా ‌అమ్మ గారికి లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చికిత్స తీసుకున్నారని… దయచేసి మా మీద తప్పుడు వార్తలు వేయవద్దని కోరారు.

నేనేమి టార్గెట్ అవ్వలేదు..మా‌ మీద సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయింది.‌.. ఇదంతా ప్రాసెస్ అన్నారు..ఎక్కువగా ఊహించుకొవద్దు.. ఎలాంటి హాడావుడి లేదని క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీ లో అంతా ఆన్ లైన్ లో బుకింగ్ .. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్సె జరుగుతున్నాయని వివరించారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి….కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటం మీద ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news