గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదర్ గూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయ ఆడమ్ ఈ బైక్ షోరూమ్‌లో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ బైక్‌లలోని బ్యాటరీలు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 12 ఎలక్ట్రిక్ బైకులు పూర్తిగా కాలిపోయాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిస్ధితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఒకేసారి అన్ని బ్యాటరీలు ఎలా పేలాయి? ఎదైనా షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.