Dil Raju will meet Pawan Kalyan today: ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ కానున్నారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు దిల్ రాజు. ఇక పవన్ నిర్ణయించిన దాన్ని బట్టే ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుందామని నిన్న ప్రకటించారు దిల్ రాజు.
ఈ తరుణంలోనే… నేడు పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు భేటీ కానున్నారు. కాగా నిన్న దిల్ రాజ్ విజయవాడలో మాట్లాడుతూ… ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారన్నారు. మెగా పవర్ స్టార్‌లో మెగాని చూస్తారు, పవర్‌ని చూస్తారని వెల్లడించారు. జనవరి 10న థియేటర్లు దద్దరిల్లుతాయని తెలిపారు దిల్ రాజు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ నిర్ణయించిన దాన్ని బట్టి చేసుకుందామన్నారు దిల్ రాజు.