డైరెక్టర్ హరీశ్ శంకర్ అనగానే మనకు గుర్తొచ్చేది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు. ఓ పక్క ఫ్యామిలీ డ్రామా పండిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులను ఆకర్షించేలా కమర్షియల్ హంగులద్దుతుంటాడు. ఈయన సినిమా అంటే ప్రేక్షకులు మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఫిక్స్ అయి మరీ థియేటర్లకు వెళ్తుంటారు. కానీ హరీశ్ స్పీడ్ తగ్గించాడు. ‘గద్దలకొండ’తర్వాత ఆయణ్నుంచి మరో సినిమా రాలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ మూవీకి కాస్త సమయం పట్టేలా ఉంది.
అయితే ఈ సమయంలో హరీశ్ శంకర్ బాలీవుడ్‌పై కాన్సంట్రేట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో తన నెక్స్ట్ మూవీ తీయాలని హరీశ్ శంకర్ గట్టిగా ట్రై చేస్తున్నాడట. దాని కోసం ముంబయి కూాడా వెళ్లాడట. త్వరలోనే సల్మాన్‌ను కలిసి స్టోరీ నరేట్ చేయనున్నట్లు టాక్. సల్మాన్ ఓకే అంటే ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హరీశ్ ‘ఏటీఎమ్’ అనే వెబ్‌సిరీస్‌కు నిర్మాతగా పనిచేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌కు దిల్‌రాజు కూతురు హర్షితా రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.