డైరెక్టర్ శంకర్ క్షేమంగా ఉన్నారా…?

-

భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో గాయపడిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఆరోగ్య పరిస్థితి ఏంటీ…? ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో శంకర్ గాయపడ్డారు. ఆయన తలతో పాటుగా, కాలుకి, శరీరంలో కొన్ని భాగాలకు గాయాలు అయ్యాయని అంటున్నారు. కాని ఆయనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు.

ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అనేది చెప్పడం లేదు. కనీసం తమిళ మీడియా కూడా ఆయన మీద ఏ వార్త కవర్ చేయడం లేదు. అటు కమల హాసన్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో ఇప్పటి వరకు ఏ ట్వీట్ చేయలేదు. కేవలం ప్రమాదంలో మరణించిన వారి గురించే అందరూ మాట్లాడుతున్నారు గాని శంకర్ లాంటి దర్శకుడు అంత తీవ్రంగా గాయపడితే ఎందుకు మాట్లాడటం లేదని అంటున్నారు.

అటు సోషల్ మీడియాలో కూడా శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. పైగా ఆయన కూర్చున్న మానిటర్ మీదే క్రేన్ పడటంతో అనుమానాలు మరీ ఎక్కువైపోయాయి. దీనితో శంకర్ ఆరోగ్యం ఎలా ఉందీ అంటూ పలువురు ఇప్పుడు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయన సేఫ్ ఏనా లేక కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version