Ram Charan Tej : మెగాస్టార్ ఇంట్లో సంద‌డి చేసిన కే.జీ.ఎఫ్. ద‌ర్శ‌కుడు… మ‌రో క్రేజీ కాంబినేష‌న్ కు సిద్ద‌మా!

-

Ram Charan Tej : మెగా అభిమానుల‌కు ద‌స‌రా రోజున స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్స్ చేసి.. థ్రిల్ చేశారు హీరో రామ్ చ‌ర‌ణ్. ఇప్ప‌టికే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించడానికి సిద్ద‌మ‌య్యాడు. దసరా రోజున తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న‌టించేందుకు సిద్దంగా ఉన్న‌న‌ట్టు .. త‌న నెక్ట్స్ మూవీ ప్రాజెక్ట్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం మరో క్రేజీ డైరెక్ట‌ర్ తో మీట్ అయి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్ నిలిచారు.
‘కె.జి.యఫ్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌. దసరాను పురస్కరించుకుని తాజాగా ప్రశాంత్ నీల్ తన నిర్మాత డీవీవీ దానయ్యతో పాటు మెగాస్టార్ చిరంజీవిని, రామ్ చరణ్ ను కలిశాడు. వారి కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవిని కలవడంతో తన చిన్ననాటి కల తీరిందని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలో ప్రశాంత్ నీల్ తోనూ రామ్ చరణ్ మూవీ చేయబోతున్నాడనే వార్త‌లు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చాయి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌తో ఆ క్రేజీ ప్రాజెక్ట్ కు మరో ముందడుగు పడిన‌ట్టు తెలుస్తుంది. ప్రశాంత్‌ చెప్పిన కథ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఈ క్రేజీ కాంబీనేష‌న్ లో వ‌స్తున్న మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. దీనిపై త్వ‌ర‌లో అధికారిక ప్రకటన రానున్న‌ద‌ట‌.

ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ -2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజులు గడిస్తే కానీ ఏది ముందు, ఏది తర్వాత సెట్స్ కెళతాయనే అనేది తెలికపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version