డైరెక్టర్, ప్రొడ్యూసర్లు అదే కావాలని కోరతారు..!!

-

సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మందకి తమ కెరియర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్దం కాదు. కొంత మందికు హిట్ రాగానే వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ వుంటారు. దానిలో కథాబలం వుందా అని కూడా చూడరు. కొందరు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వుంటారు. కొన్ని సార్లు ఒక్క హిట్ తో వెంటనే తమ రేటు పెంచుకుంటారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రం కొద్దిగా  తెలివిగా  పనిచేస్తూ వుంటారు. అలాంటి హీరోయిన్ నిధి అగర్వాల్.

 

నిధి నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను.. సినిమా, హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి  హిట్ సినిమాలలో నటించింది.ఈ సినిమాల తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. ఇక ఇక్కడ లాభం లేదని కోలీవుడ్ పరిశ్రమలో అదృష్టం పరీక్షించు కోవడం కోసం చెన్నై వెళ్ళింది. ఆమె అదృష్టం బాగుండి కోలీవుడ్లో మంచి అవకాశాలుదక్కాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో  నిధి అగర్వాల్ కోలీవుడ్ లో తన సక్సెస్ సీక్రెట్ ను బయట పెట్టింది.

 నిది మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నటన చూసి  అవకాశాలు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు వచ్చే సినిమాలలో హీరోయిన్ ల పని గ్లామర్ చూపించడమే. దాని కోసమే ఆడియన్స్ థియేటర్ కు వస్తారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కూడా హీరోయిన్ గ్లామర్ గా వుండాలని కోరుకుంటారు. కాబట్టి నేను అందాల ప్రదర్శనకు ఒకే చెప్పాను అని చెప్పుకొచ్చింది. అలాగే కొంత మంది  స్టార్ హీరోల సినిమాలో అవకాశం ఇస్తామని ప్రొడ్యూసర్, డైరెక్టర్లు వేస్తే నేను డబ్బులు డిమాండ్ చేయను ,అలాగే గొంతెమ్మ కోరికలు కోరను, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటా, అలాగే నా మినిమం రేట్ చెబుతాను. ఎందుకంటే ఒక స్టార్ పక్కన నటిస్తే నెక్ట్స్ ఛాన్స్ లు అవే వస్తాయని నాకు తెలుసు , అని తన సీక్రెట్ బయట పెట్టింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version