తమ మీద ఈడీ నమోదు చేసిన కేసులో జగన్, విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసుల విచారణ కూడా మొన్నీమధ్య ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధులు, మాజీలపై ఉన్న కేసులపై రోజువారీ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో అందరు ప్రజాప్రతినిధులుతో పాటు జగన్ కేసులు కూడా విచార్నాకు వచ్చ్హాయి.
హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నాఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్‌కు లీజులు, ఇందూగ్రూపు, వాన్‌పిక్‌కు భూకేటాయింపులుపై సీబీఐ నమోదు చేసిన 11 కేసుల విచారణ జరగనుంది. అలాగే ఈడీ నమోదు చేసిన 5 కేసులు, ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ కేసులని కూడా విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులకు సంబందించే ఆయన డిశ్చార్జ్ పిటిషన్ లు దాఖలు చేసినట్టు సమాచారం.