ఇటలీలో ‘కల్కి’ షూటింగ్ ఫొటోలు షేర్ చేసిన దిశా పటాని

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .కల్కి షూటింగ్ శరవేగంగా సాగుతోంది.తాజాగా మూవీ షూటింగ్కు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ ట్విటర్లో పంచుకున్నారు. ఇటలీలో జరిగిన సాంగ్ షూట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో చూపారు. అయితే, మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలొస్తుండటంతో సాంగ్ అయినా విడుదల చేయాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు మే 9 న రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.దీంతో సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9న రిలీజ్ అనుకోగా,తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మేకర్స్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version