ప్రభుత్వం ఏదైనా ఆలయాలు, ఎండోమెంట్ నుంచి వచ్చే ఆదాయం మీదనే ఫోకస్ చేస్తున్నాయి గానీ, టెంపుల్ అభివృద్ధి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, భక్తులకు ఉచిత సౌకర్యాలు అందించే విషయాలను గాలికి వదిలేస్తున్నాయి. టెంపుల్ ఆదాయాన్ని మిగత పథకాల కోసం వాడుకుంటున్న ప్రభుత్వాలు భక్తులకు క్వాలిటీ సర్వీస్ అందించే విషయంలో ఎందుకు రాజీపడుతున్నాయో చెప్పడం లేదు.
తాజాగా భద్రాచలం రాములోరి సన్నిధిలో అపచారం జరిగింది. పురుగులు పట్టిన తలంబ్రాలను ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నట్లు వెల్లడైంది. విషయం బయటకు రావడంతో రూ.లక్షల విలువైన ముత్యాల తలంబ్రాలు నేలపాలు అయ్యాయి. రాములోరి సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ పవిత్రత, భక్తుల నమ్మకం అంటే మీకు ఇంత నిర్లక్ష్యమా? అంటూ భక్తులు మండిపడుతున్నారు.
https://twitter.com/bigtvtelugu/status/1900050008248115381