ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ తన సబ్స్క్రైబర్లకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి పలు షోస్ ఈ ప్లాట్‌ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోవని స్పష్టం చేసింది. ఇటీవలే ఐపీఎల్ టోర్నీ ప్రత్యక్ష ప్రసార హక్కులను కోల్పోయిన హాట్‌స్టార్.. ఇప్పుడు ప్రముఖ హెచ్‌బీఓ కంటెంట్‌కు కూడా దూరమైంది. హాలీవుడ్ సినిమాలతో పాటుగా ప్రముఖ షోలను అందించే హెచ్‌బీఓ కంటెంట్.. మార్చి 31 నుంచి హాట్‌స్టార్‌లో ఉండదని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సంస్థాగత ఖర్చులను తగ్గించుకోవాలని తీర్మానించుకున్న కొద్ది రోజులుకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ప్రముఖ హెచ్‌బీఓ ఛానల్లో ప్రసారం అయ్యే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ద లాస్ట్ ఆఫ్ అజ్, ఇండస్ట్రీ, వాచెమెన్ షోలకు భారత్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అమెరికాలో ప్రసారం అయ్యే ఈ షోలు అదే రోజున హాట్‌స్టార్ ద్వారా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చేవి. ఇకపై మాత్రం అలా కుదరదు. అయితే.. ప్రస్తుతం 10 భాషల్లో లక్ష గంటలకు పైగా హాట్‌స్టార్‌లో ఉన్న టీవీ షోలు, సినిమాలు, రకరకాల స్పోర్ట్స్ కార్యక్రమాలను చూసి ఆనందించవ్చని డిస్నీ+ హాట్‌స్టార్ ట్వీట్ చేసింది.