కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా బెనిఫిట్స్ ని పొందవచ్చు. నిరుపేద వర్గాలను ఆర్థికంగా పరిపుష్టిగా మార్చేందుకు కేంద్రం అనేక స్కీమ్స్ ని అందిస్తోంది. వాటిలో ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ తో అనేక లాభాలని పొందేందుకు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 50,000 వరకు ఆర్థిక సహాయాన్ని రుణంగా ఈ స్కీమ్ తో పొందవచ్చు.
ఇక పూర్తి వివరాలని చూస్తే… ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే.. తీసుకున్న రుణాన్ని తిరిగి సకాలంలో చెల్లించాలి. అప్పుడు ఇంకో సరి లోన్ ని పొందొచ్చు. పీఎం స్వనిధి యోజన పథకం డిసెంబర్ 2024 వరకు ఉంటుంది. మొదటి సారి రూ. 10,000 లేదా రెండో సారి రూ. 20,000 లోన్ గా వస్తుంది. మూడోసారి రూ. 50,000 వరకు లోన్ వస్తుంది. దీని కింద 7 శాతం వరకు సబ్సిడీని పొందే అవకాశం వుంది. అయితే లబ్ధిదారులు తీసుకున్న రుణాన్ని సకాలంలో కట్టేస్తే వస్తుంది.
ఈ స్కీమ్ కోసం కావలసిన డాక్యుమెంట్స్ ఇవే…
ఆధార్ కార్డ్, ఓటరు ఐడి కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో కాపీ, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో
రుణం కోసం దరఖాస్తు చేయడానికి అవసరం అవుతాయి. వెబ్‌సైట్ www.pmsvanidhi.mohua.gov.in ని సందర్శిస్తే పూర్తి వివరాలని చూడచ్చు.