బిగ్ బ్రేకింగ్: ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా.. వైఎస్ఆర్ జయంతికి కాదు!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం విషయంలో బిగ్ బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

అవును… జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే! ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా ఇళ్ల పట్టాల కోసం స్థల సేకరణ జరిపింది.

అయితే ఈ విషయంలో కొన్ని చోట్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో దీనిని వాయిదా వేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసుల ఉన్న కారణంగా ప్రస్తుతం అనుకున్న తేదీన కాకుండా.. ఇళ్ల పట్టాలను ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version