కరోనా కలకలం : రష్యాను మించిపోయిన భారత్..!

-

క‌రోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు భార‌త్ మూడో స్థానానికి చేరుకుంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం భారత్‌లో మొత్తం 6,85,085 కరోనా కేసులు నమోదవ్వగా, రష్యాలో 6 ,81,251 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 6.85 లక్షల కేసులు రావడానికి 158 రోజులు పట్టింది. ప్రతిరోజూ సగటున 22వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. జూన్‌లో 3,87,425 కేసులు నమోదయ్యాయి. జూన్ 21 నుండి ప్రతిరోజూ 15 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. ఐదోస్థానంలో ఉన్న పెరూలో 3,02,718 మంది కరోనా బారినపడగా, 10,589 బాధితులు చనిపోయారు.

 

ఇక తొమ్మిదో స్థానంలో ఉన్న మెక్సికోలో నిన్న 4683 పాజిటివ్‌ కేసులు నమోదవగా, కొత్తగా 273 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 2,56,848కి చేరగా, ఈ వైరస్‌ వల్ల 30,639 మంది మృతిచెందారు. ఇక భారత్ విషయానికొస్తే మహారాష్ట్రలో 6555 కేసులు,తమిళనాడులో 4150 కేసులు,ఢిల్లీలో 2,505 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే కరోనాతో 151 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 86,040 పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 8222 మంది కరోనాతో మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version