షర్మిలపై డీకే అరుణ్ ఫైర్ అయ్యారు. సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారని.. వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్ల షర్మిల పార్టీ పెట్టారని మండిపడ్డారు. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదు, పని చేయలేదని ఆగ్రహించారు. సెంటిమెంట్ ఉన్నంత వరకు ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించబోరని పేర్కొన్నారు.
షర్మిల ఎపిలోనే పోటీ చేయవచ్చు కదా… తెలంగాణ లో ఎందుకు పార్టీ పెట్టారని మండిపడ్డారు. 2019 ఎన్నికలలో కూడా ఎపి లోనే షర్మిల ప్రచారం చేశారని.. అప్పుడు తెలంగాణ లో ఆమె ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎపి లో ఎందుకు పోటీ చేయడం లేదో ఆమే చెప్పాలి… బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని.. కాళేశ్వరం విషయంలో జగన్, కేసిఆర్ పై మంచి అండర్ స్టాండింగ్ ఉందని ఆరోపించారు. ఓట్లు సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని జగన్, కేసీఆర్ లపై మండిపడ్డారు డీకే అరుణ.