అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూడిమడక తీరంలో గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
ఇప్పటి వరకు గల్లంతైనవారిలో పవన్ సూర్యకుమార్ (గుడివాడ) గణేశ్(మునగపాక), జగదీశ్(గోపాలపట్నం), రామచందు(ఎలమంచిలి), విద్యార్థి సతీశ్(గుంటూరు)ల మృతదేహాలు లభ్యమయ్యాయి. జశ్వంత్(నర్సీపట్నం) కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. శుక్రవారం రోజున డైట్ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మొత్తం 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్‌కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీద కూర్చుని ఉండగా.. 11 మంది సముద్రంలోకి స్నానానికి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థులపైకి ఓ రాకాసి అల వచ్చి పడింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే ఐదుగురు తిరిగి తీరానికి కొట్టుకొచ్చారు. ఏడుగురు మాత్రం బయటికి రాలేకపోయారు. ఒడ్డు మీద ఉన్న విద్యార్థితో పాటు బయటికి వచ్చిన వారు పెద్దగా అరవడంతో దగ్గరలో ఉన్న స్థానికులు ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు.