మహబూబ్ నగర్ లో స్వల్ప మెజార్టీతో డీ.కే.అరుణ గెలుపు

-

దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా చాలా ఉత్కంఠగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించింది. అలాగే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఫలితం చాలా ఉత్కంఠ రేకేత్తించింది. అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. తాజాగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఫలితం చాలా ఉత్కంఠగా మారింది.

తొలుత బీజేపీ అభ్యర్థి డీ.కే.అరుణ ముందంజలో కొనసాగారు. ఆ తరువాత కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ముందంజలో కొనసాగారు. ముఖ్యంగా కోడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగింది. మిగతా స్థానాల్లో బీజేపీ హవా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ కి ముందు డీ.కే.అరుణ 7వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ఫలితాల తరువాత చివరికీ 4,500 మెజార్టీతో విజయం సాధించింది బీజేపీ అభ్యర్థి డీ.కే.అరుణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version