దీపావళి పార్టీలు ఇలా చేస్తారా? : ఎంపీ చామల

-

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడలో రేవ్ పార్టీ నిర్వహించాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఆ పార్టీలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని, పెద్ద ఎత్తున ఫారిన్ లిక్కర్ లభ్యం మైందని పోలీసులు పేర్కొన్నారు. ఆ మద్యం బాటిళ్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుంది. అది రేప్ పార్టీ కాదు దీపావళి పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇళ్లలో దావత్‌లు చేసుకోవద్దా.. చేసుకుంటే తప్పేముందంటూ మీడియా ముఖంగా మాట్లాడారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేవ్ పార్టీలపై ప్రభుత్వం చెబితేనే పోలీసులు దాడి చేయరని అన్నారు.ఫామ్‌హౌస్ ఘటన డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందన్నారు.పార్టీలో పాల్గొన్న వారిలో ఎంత పెద్దవారు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని కోరారు.కేటీఆర్ చెప్పినట్లుగా దీపావళి పార్టీలు ఇలా ఎవరూ చేసుకోరని ఫైర్ అయ్యారు. ఒకవేళ పార్టీ చేసుకుంటే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలని తెలియదా? అని మండిపడ్డారు.పార్టీలో ఒకరికి డ్రగ్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news