ఫ్రీ ఇంటర్నెట్ డేటా అని సంబర పడకండి.. ఇలాంటి వాటికి టెంప్ట్ అయితే ఇరుక్కున్నట్టే..!

-

ఈ మధ్య కాలంలో జరుగుతున్న మోసాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నోరకాల మోసాలను మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మితే మనమే మోసపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వార్తలు జోలికి వెళ్లకపోవడమే మంచిది. తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది.

నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. వాటితో జాగ్రత్తగా ఉండాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తాజాగా ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది. దానిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చెప్పారు.

ఎక్కువగా ఫ్రీగా రీఛార్జ్ చేస్తామంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ఫ్రీగా రీఛార్జ్ చేస్తున్నారు కదా మనకి ఖర్చు ఉండదు అని చాలా మంది టెంప్ట్ అవుతుంటారు ఇలా ఫ్రీగా రీఛార్జ్ అంటూ వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉండే డేటా మోసగాళ్లు చేతి లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఫ్రీగా రీఛార్జ్ చేస్తామన్న వార్తలు వస్తుంటే వాటిని నమ్మకండి.
అలాగే మోసగాళ్లు వీలైనంత వరకూ మిమ్మల్ని మోసం చేయడానికి లింక్స్ ని పంపిస్తూ ఉంటారు. వాటిపై క్లిక్ చేయకూడదు.
తెలియని యూఆర్ఎల్ మీద క్లిక్ చేసినట్లయితే ఏదో ఒక వెబ్ సైట్ ఓపెన్ అయిపోతుంది. వాటి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి.

మీకు కనుక ఇలాంటి మెసేజ్లు వచ్చాయి అంటే ఇలా చెయ్యండి:

ఆ లింక్ మీద క్లిక్ చెయ్యద్దు.
ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దు.
లింక్ ని ఫార్వర్డ్ చేయొద్దు.
డిలీట్ చేసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version