భవిష్యత్తు బాగుండాలంటే ఉదయాన్నే వీటిని మర్చిపోకుండా చేయండి..!

-

మనం రోజుని ఎంత ప్రశాంతంగా అందంగా మొదలు పెడితే రోజంతా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఉదయం చక్కగా ప్రారంభం అయితే రోజంతా కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అందుకనే పెద్దలు లేచిన తర్వాత ఆ భగవంతుడిని తలుచుకుని నిద్రలెమ్మని చెప్తారు. అలా చేయడం వల్ల సంతోషంగా ఉండడానికి అవుతుంది. అయితే ఆచార్య చాణక్య రోజూ నిద్ర లేవగానే ఈ విధంగా అనుసరిస్తే మంచిదని చెబుతున్నారు. మరి ఇక ఏ ఆలస్యం లేకుండా దాని కోసం చూసేద్దాం.

 

మీరు ప్రతి రోజు బాగుండాలని కోరుకుంటే దాని కోసం వీటిని ఫాలో అవ్వాలని చెప్పారు. ఉదయం నిద్రలేచిన తర్వాత అస్సలు మీరు ఎవరి మీదా కూడా కోపం తెచ్చుకోకండి. అలానే ఎవరినీ బాధ పెట్టే మాటలు అనకండి. నిజానికి వీటివల్ల మన మూడ్ పాడవుతుంది.

ఇది రోజు మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకనే ఎప్పుడూ కూడా నిద్ర లేవగానే ఇలాంటివి చేయకండి. మీరు కనుక రోజుని ఆనందంగా మొదలు పెడితే రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది అలాగే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం నుండి సూర్యోదయం మధ్య లో నిద్ర లేవడం మంచిది. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆలస్యంగా కనుక నిద్ర లేచారంటే ఉదయం ఉండే సానుకూలతను ఆస్వాదించడానికి అవ్వదు. కాబట్టి నిద్ర లేవగానే వీటిని ఫాలో అవ్వండి దానితో సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version