తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అలానే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. అలానే మనం ఎలా ఆహారం తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. అయితే ఈ రోజు చాలా మంది చేసే తప్పులు గురించి చూద్దాం. అదే విధంగా జీర్ణ సమస్యలు కూడా ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి:

చాలామంది 24 గంటలు ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే అలా తినడం మంచిది కాదు. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడే తినాలి. ముందు తిన్న ఆహారం అరిగిపోయిన తర్వాత మళ్లీ ఆహారం తీసుకోవాలి. అంతే కానీ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి.

టీవీ చూస్తూ తినొద్దు:

టీవీ చూస్తూ ఆహారం తినడం అస్సలు మంచిది కాదు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా, కంఫర్టబుల్ గా కూర్చుని తినాలి. ఏ ఇబ్బందులు లేకుండా మీరు ప్రశాంతంగా కూర్చుని తింటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

సరిపడా తినండి:

మీకు ఎంత అవసరం అనుకుంటున్నారో అంత ఆహారాన్ని మాత్రమే తినండి. ఇది నిజంగా చాలా మంచి అలవాటు. అలానే గోరువెచ్చటి ఆహారం తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అసలు తీసుకోద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

నాణ్యమైన ఆహారం తీసుకోండి:

తక్కువ నూనె వాడడం ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం లాంటివి చేయాలి. అదే విధంగా డైట్ లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పాలు, చేప మొదలైనవి తీసుకోవాలి. అలానే తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. వేగంగా నమిలితే సరిగ్గా జీర్ణం అవ్వదు ఇలా తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఉండొచ్చు. అదేవిధంగా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version