ఈ వస్తువులని అస్సలు కింద పెట్టకండి.. హిందూ ధర్మం ఏం చెప్తోందంటే..!

-

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని మనం తప్పకుండా పాటించాలి. కొన్ని వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను పవిత్రంగా చూసుకుంటాము. ఆ వస్తువులని శుభ్రమైన చోట లోనే ఉంచుతాము కనీసం కింద కూడా పెట్టము. చాలా మంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులని మీరు చేయకుండా చూసుకోండి.

ఎప్పుడూ కూడా మనం పూజకి ఉపయోగించే వస్తువులను కింద పెట్టకూడదు ఉదాహరణకి కర్పూరం కానీ కొబ్బరికాయలను కానీ పువ్వులను కానీ కింద పెట్టకూడదు. ఒకవేళ కనుక వాటిని కింద పెడితే వాటిని పూజకి ఉపయోగించకూడదు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇంకొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు. సాలిగ్రామాన్ని అసలు కింద పెట్టకూడదు సాలిగ్రామం విష్ణువుకి ప్రతిరూపం అసలు ఆ తప్పును ఎప్పుడు చేయకండి. జంధ్యం ని కూడా కింద పెట్టకూడదు. జంధ్యాన్ని తల్లిదండ్రులు గురువులకి ప్రతిరూపంగా భావించాలి. వాటిని నేల మీద పెట్టకండి.

దీపాన్ని కూడా అసలు కింద పెట్టకూడదు దీపం పెట్టేటప్పుడు దీపం కుందు కింద ఒక చిన్న పళ్లెం ని కానీ ఒక తమలపాకుని కానీ పెట్టాలి నేలపై పెడితే దేవతలకు అవమానం కలిగినట్లు మనం దేవతల్ని అవమానించకూడదు. బంగారాన్ని కూడా అస్సలు కింద పెట్టకూడదు బంగారం లక్ష్మీ రూపంగా భావించాలి. నేల మీద బంగారాన్ని ఉంచితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అదేవిధంగా శంఖువుని కూడా అస్సలు కింద పెట్టకూడదు లక్ష్మీదేవి ఇందులో కొలువై ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పుని అసలు చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version