కాంగ్రెస్ పార్టీ నేతలపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని.. ఆ పార్టీకి ధరణి వద్దు, రైతు బంధు వద్దు, ఉచిత కరెంటు వద్దని మండిపడ్డారు. రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. నేడు కేసీఆర్ గారి పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారని దుయ్యబట్టారు.
నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చ బడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడని విమర్శించారు హరీష్ రావు. పార్టీ మారినా ఆ మనిషి మారలేదన్నారు. ఆయన మనసు కరగలేదన్నారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలన్నారు. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలన్నారు.