ఈ పండుగ సీజన్‌లో ఈ వ్యాపారాలు చేయండి.. ఫుల్ డిమాండ్‌

-

ఇండియాలో పండగుల హడావిడి మొదలైంది. వినాయకచవితి అయిపోయింది.. దీపావళి, దసరాకు ఆఫర్లు కూడా స్టాట్‌ అయ్యాయి. ఈ టైమ్‌లో చేయదగ్గ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారానికి టైమ్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కోడిపందాలు సంక్రాంతికి జోరుగా సాగుతాయి. అక్కడ టీ అమ్ముకున్న రోజుకు వెయ్యి ఈజీగా వచ్చేస్తాయి. అది కూడా బిజినెస్‌ ట్రిక్.. అలా ఈ సీజన్‌లో చేయదగ్గ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. అవేంటంటే..

టీ/కాఫీ స్టాల్

పండుగల సమయంలో టీ, కాఫీ వంటి పానీయాలకు డిమాండ్‌ ఉంటుంది. పూజ పాండల్స్, ఇతర రద్దీ ప్రాంతాల్లో టీ లేదా కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందవచ్చు.

విగ్రహాల దుకాణం

దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు పూజల కోసం దేవతా మూర్తుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అందుకే ఈ పండుగల సమయంలో విగ్రహాల తయారీ, విక్రయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

స్వీట్స్ షాప్

స్వీట్లు లేకుండా దసరా, దీపావళి, దుర్గాపూజ అసలు పూర్తి కాదు. అందుకే ఈ సీజన్‌లో బిజీ స్ట్రీట్స్‌లో మిఠాయిలు తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించండి. లడ్డూలు, జిలేబీలు, రసగుల్లాలు, గులాబ్ జామూన్‌లు వంటి ట్రీట్‌లను ఆఫర్ చేయండి. వీటి ధర కేజీ రూ.200 నుంచి రూ.1,000 మధ్య ఉంటుంది.

గృహాలంకరణ

పండుగ సమయంలో గృహాలంకరణకు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే ఇళ్లు, బాల్కనీలు, ప్రాంగణాలను అలంకరించేందుకు రంగురంగుల లైట్లు, గోడ గడియారాలు, ఫోటో ఫ్రేమ్‌లు, క్యాండిల్ స్టాండ్‌లు, షోపీస్‌లు, ల్యాంప్‌షేడ్‌లు వంటి వాటిని సేల్‌ చేయొచ్చు.

మెహందీ షాప్

ఆడవాళ్లు పండగ వచ్చిందంటే.. మెహందీ పెట్టుకోవాల్సిందే. ఇది వారి అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. మెహందీ డిజైన్ దుకాణాన్ని ఓపెన్‌ చేయడం ద్వారా పండుగకు వెళ్లేవారిని, ముఖ్యంగా మహిళలను ఆకర్షించవచ్చు. తాత్కాలిక టాటూలు లేదా స్టిక్కర్ టాటూ సేవలను కూడా అందించవచ్చు.

ఫుడ్ స్టాల్స్

ఆలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల వద్ద ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయడం మంచి ఆలోచన. బిర్యానీ, సమోసాలు, చాట్, పానీపూరీ, చైనీస్ ఫుడ్స్ వంటివి విక్రయించడం ద్వారా రోజుకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు సంపాదించవచ్చు.

పూల విక్రయం

పండుగలలో ముఖ్యంగా పూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పూల దండలు, పుష్పగుచ్ఛాలు, వివిధ రకాల ఆకులను పూజ కోసం విక్రయించడానికి తాత్కాలిక పూల దుకాణాన్ని ఏర్పాటు చేయవచ్చు. మంచి లాభాలను అందుకోవచ్చు.

బట్టల దుకాణం

పండుగకు వెళ్లేవారు కొత్త బట్టలు కొనడానికి ఇష్టపడతారు. బట్టల దుకాణాన్ని ఓపెన్‌ చేసి, పండుగ ప్రారంభానికి ముందే వస్తువులను అమ్మడం ప్రారంభించవచ్చు. ఫెస్టివల్ సీజన్ అంతటా మంచి వ్యాపారం జరుగుతుంది.

గిఫ్ట్‌ షాప్‌

మన పండుగలలో బహుమతులు ఇవ్వడం ఒక ముఖ్యమైన భాగం. రిమోట్-కంట్రోల్‌ టాయ్స్, కాస్మటిక్స్‌, పండుగల సమయంలో ప్రజలు మార్పిడి చేసుకోవడానికి గృహాలంకరణ వంటి అనేక రకాల వస్తువులను విక్రయించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version