కార్తీక పౌర్ణమి నాడు తల్లులు ఇలా చేస్తే.. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది..!

-

కార్తీకమాసం అంటే శివుడికి చాలా ఇష్టం. కార్తీక మాసంలో శివుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కార్తీక పౌర్ణమి శక్తివంతమైనది. చంద్రుడికి పూర్తిగా శక్తి లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం తులసి కోట దగ్గర తల్లులు పూజ చేయడం వలన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉంటారట. కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేసి తులసి కోట ముందు ముగ్గులు పెట్టాలి.

 

పుష్పాలతో తులసి కోటని అందంగా అలంకరించుకుని.. మట్టి ప్రమిదలతో, నువ్వుల నూనెతో దీపాలని వెలిగించాలి. దీపారాధన చేసాక ఉసిరికాయ దీపాలని పెట్టాలి. చిన్నగా చెక్కు తీసి ఉసిరికాయని ఆవు నేతిలో ముంచి కుంభ వత్తిని దానిమీద పెట్టి దీపాలని పెట్టాలి. రాగి నాణాన్ని కానీ రూపాయి బిళ్ళని కానీ తమలపాకు పై పెట్టి దానికి గంధం రాసి చంద్రుడుగా భావించి కుంకమ్మ బొట్టు పెట్టి నమస్కారం చేయాలి.

చంద్ర అష్టోత్తరం చదివి చంద్రుడిని భక్తితో ఆరాధించాలి. ధూప దీప నైవేద్యాలతో చంద్రుడిని పూజ చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. రాగి నాణెం లేదా రూపాయి బిళ్ళకి నమస్కారం చేసి దానిని పిల్లలు చదువుకునే చోట పెట్టాలి. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగించుకుంటే కూడా మంచి జరుగుతుంది. సంవత్సరంలో ఏ రోజైనా దీపాన్ని వెలిగించకపోయినా.. వెలిగించలేకపోయినా కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగించుకోవడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దోషాల నుంచి బయటపడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version