రైతులు పంటల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పంటల విషయంలో జాగ్రత్తగా ఉండక పోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది రైతులు తమ పొలాల్లో ఒకే పంటని మళ్లీ మళ్లీ వేస్తే బాగా సంపాదించవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అలా జరగదు. వాళ్ల కష్టానికి తగ్గట్టు పంట కూడా పండదు. దీనికి గల కారణం ఏమిటంటే..? భూమి లో వచ్చిన మార్పులు. అందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట మార్పిడి పాటించాలని చెప్తున్నారు.
పంట మార్పిడి పాటిస్తే రైతులు ఆదాయం పెరుగుతుంది. చాలా మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ విధంగా రైతులు అనుసరిస్తే ఖచ్చితంగా మంచిగా లాభాలు పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. పంట మార్పిడి అంటే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. పంట మార్పిడి వల్ల నేలలోని పోషకాలను వృద్ధి చేయొచ్చు.
పంట మార్పిడి అంటే ఏం లేదండి ఒకవేళ ఒక రైతు మొక్కజొన్నని వేస్తె అది అయ్యాక పప్పు ధాన్యాలు వేయాలి లేదు అంటే ఇతర పంటలు ఏమైనా వేసుకోవచ్చు. ఇలా మార్పిడి చేస్తూ ఉండాలి. భూమి సారవంతంగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది.
కానీ అదే పంటను సంవత్సరమంతా రైతు పండిస్తూ ఉంటే ఫలితం ఉండదు. దిగుబడి తక్కువగా వస్తుంది. అలానే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు పంట మార్పిడి పద్ధతిని అనుసరిస్తే బాగుంటుంది. సహజసిద్ధమైన పోషకాలు తిరిగి నెలలో కూడా వస్తాయి.