బ్యాంకులో ఎక్కువ వడ్డీ రావాలంటే ఇలా చేయండి…!

-

చాలా మంది బ్యాంకింగ్ రంగంలో తెలియని సదుపాయం ఏదైనా ఉందీ అంటే అది ఆటో స్వీప్. ఆటో స్వీప్ గురించి బ్యాంకులు పెద్దగా తమ వినియోగదారులకు చెప్పే ప్రయత్నాలు చేయవు. ఆటో స్వీప్ అనేది సేవింగ్స్ ఖాతాలో ఉండే ఒక మంచి సదుపాయం. చాలామందికి ఈ సదుపాయం గురించి పెద్దగా అవగాహన లేదు. కాని ఈ ఆప్షన్ మీరు ఎంచుకుంటే మాత్రం ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం సేవింగ్స్ కి బ్యాంక్ లు మూడు నుంచి 4 శాతం మాత్రమె వడ్డీ ఇస్తున్నాయి. దీని ద్వారా మనం ఎక్కువ వడ్డీ పొందే సదుపాయం ఉంటుంది. దాని గురించి అవగాహన పెంచుకుని వాడుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. అసలు ఆటో స్వీప్ అంటే ఏంటీ అనేది తెలుసుకోండి. సేవింగ్స్ ఖాతాలో అవసరానికి మించి డబ్బు ఉంటే దాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ లోకి మళ్ళించడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

అవసర౦ లేని సొమ్ముని దానిలోకి మళ్ళించవచ్చు. ఒకవేళ మీ ఖాతాలో లక్ష ఉంటే అందులో మీకు 25 శాతం మాత్రమె అవసరమైతే… మిగిలిన్ 75 శాతం అంటే 75 వెలను…ఆటో స్వీప్ ద్వారా ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్లించొచ్చు మీ ఖాతాలో ఉండే 25 వేలు అలాగే ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి వెళ్లిన రూ.75,000 డబ్బుపై మీకు ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి మళ్ళించే అవకాశం ఉంటుంది. డబ్బులు ఒకవేళ అవసరం అని భావిస్తే డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో డబ్బులు అలాగే ఉన్న వారికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. పదే పదే విత్ డ్రా చేయకుండా ఉంటే వడ్డీ వస్తుంది. కనీసం 30 రోజులు అయినా మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంచాలన్న నిబంధనలు కొన్ని బ్యాంకుల్లో ఉన్నాయి.

ఆ సమయం లోగా డ్రా చేస్తే గనుక ప్రీమెచ్యూర్ విత్‌డ్రాయల్ పెనాల్టీ కూడా చెల్లించాలి. ఆటో స్వీప్ రెండు రకాలుగా మీకు అందుబాటులో ఉంటుంది. ఒకటి (Last In First Out (Lifo). అంటే దీర్ఘకాలం ఎఫ్‌డీలో డబ్బులు జమ చేసేవారికి ఉపయోగపడుతుంది.. ఎక్కువ వడ్డీ వస్తుంది. తరచూ డబ్బులు తీస్తూ ఉంటే First In First Out (Fifo) ఎంచుకోవాలి. అందుకే ఆటో స్వీప్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఎంచుకోవాలి.

మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఆటో స్వీప్ ద్వారా గరిష్టంగా 8% వరకు వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆటో స్వీప్ ఫెసిలిటీ గురించి తెలుసుకుని దాన్ని వినియోగించుకుంటే మంచిది. దాదాపు అన్ని బ్యాంకులు కూడా దీనిని తమ వినియోగదారులకు అందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version