ఆ రైతులకి పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు రావు..!

-

రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చారు. ఈ స్కీమ్స్ తో చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చాలా మంది రైతులు బెనిఫిట్స్ ని పొందుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నగదును త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేయనున్నారు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. పీఎం-కిసాన్ స్కీమ్ నగదు జమ తేదీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా రిలీజ్ చేయలేదు. మే నెలాఖరులోగా లేదా జూన్ నెల మొదటి వారంలో ఈ డబ్బులు రావచ్చు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం13వ విడత నగదు ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ పథకం కింద దేశంలోని అర్హులైన రైతులు నాలుగు నెలలకి ఓ సారి రూ.2,000 చొప్పొన అందుకుంటారు. మూడు విడతల్లో రూ.6,000లను పొందుతారు. రైతుల కోసమే ఈ స్కీమ్ ని కేంద్రం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులని పొందేందుకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, eKYC చేయడం తప్పనిసరి.

అలానే 14వ విడత ప్రయోజనాన్ని పొందడానికి అవసరమైన ముఖ్యమైన పత్రాలు ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా, బ్రాంచ్ వివరాలు, భూహక్కు పత్రాలు సబ్మిట్ చెయ్యాలి. లేకపోతే డబ్బులు పడవు. మీకు సమస్య ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను అడిగి సమాచారం తెలుసుకోండి. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని భర్త, భార్య, పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా పొందుతున్నారు. కుటుంబంలోని లబ్దిదారుల సంఖ్యకు పరిమితి లేదు. వాళ్ళ పేరు మీద భూమి ఉండాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version